బిలియనీర్‌ క్లబ్‌నుంచి అంబానీ ఔట్‌

Anil Ambani falls off billionaire club - Sakshi

 ప్రపంచ కుబేరుల్లో 6వ స్థానంలో అనిల్‌అంబానీ  ఇది గతం 

ప్రస్తుతం ఆ స్థానంనుంచి పడిపోయిన అనిల్‌

సాక్షి, ముంబై :  అడాగ్‌ గ్రూపు అధినేత, అనిల్‌ అంబానీ  బిలియనీర్‌ క్లబ్‌నుంచి కిందికి పడిపోయారు. 2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6 వ  స్థానంలో  నిలిచిన అనిల్ అంబానీ ఇప్పుడు  ప్రస్తుతం ఆ స్థానాన్ని కోల్పోయారు. 11 సంవత్సరాలలో, అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ  3,651 కోట్ల రూపాయలకు (523 మిలియన్ డాలర్లు) కుప్పకూలింది. దీంతో  ఈ పరిణామం చోటు చేసుకుంది. 

అప్పుల సంక్షోభం, టెలికాం సంస్థ ఆర్‌కాంతోపాటు  ఇతర గ్రూపుసంస్థల వరుస నష్టాల నేపథ్యంలో  అంబానీ సామ్రాజ్యం కుప్పకూలింది.  ముఖ్యంగా  మ్యూచుఫల్‌ ఫండ్‌ జాయింట్‌ వెంచర్‌ రిలయన్స్‌  నిప్సాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో బ్యాంకులు 43 శాతం వాటాలను విక్రయించడం షాకింగ్‌ పరిమాణం. అలాగే రుణాలను తీర్చేందుకు ప్రధాన ఆస్తులు వ్యాపారాల అమ్మకంతో అనిల్‌ అంబానీ సంపద బాగా క్షీణించింది.  కాగా ఇటీవల ఆస్తులను అమ్మిఅయినా మొత్త రుణాలను  తీరుస్తామని అనిల్‌అంబానీ హామీ ఇచ్చారు. గత గత 14 నెలల్లో  రూ .35 వేల కోట్లకు పైగా రుణాలు  తీర్చామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 రిలయన్స్ గ్రూప్ విలువ నాలుగు నెలల క్రితం రూ .8వేల కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఆయన మొత్తం సంపద 42 బిలియన్‌ డాలర్లనుంచి 0.5  బిలియన్‌ డార్లకు పడిపోయింది. 2018 ,మార్చి నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం 1.7 లక్షల కోట్లకు పైగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top