ఆర్‌కామ్‌ స్పెక్ట్రమ్‌పై టెలికాం దిగ్గజం కన్ను | Airtel now interested in buying RCom's spectrum | Sakshi
Sakshi News home page

ఆర్‌కామ్‌ స్పెక్ట్రమ్‌పై టెలికాం దిగ్గజం కన్ను

Nov 24 2017 4:42 PM | Updated on Nov 24 2017 8:23 PM

 Airtel now interested in buying RCom's spectrum - Sakshi - Sakshi

వరుస కొనుగోళ్లతో జోరు మీదున్న టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, మరో టెలికాం సంస్థపై కన్నేసింది. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్‌కు చెందిన ఎంపికచేసిన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రూ.45వేల కోట్ల రుణంతో తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్‌, ప్రస్తుతం తన ఆస్తుల అమ్మకానికి చర్యలు చేపడుతోంది. ఆర్‌కామ్‌ ఆస్తులను కొనుగోలు చేసేందకు ఆసక్తితో ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆ కంపెనీకి చెందిన ఎంపికచేసిన స్పెక్ట్రమ్‌, కొన్ని పరికరాలను కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఎయిర్‌టెల్‌ అధికారి ప్రతినిధి చెప్పారు. 

రిపోర్టుల ప్రకారం ఎయిర్‌టెల్‌ ఎక్కువగా 850 మెగాహెడ్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌పై రిలయన్స్‌ జియోకు పోటీ ఇవ్వాలనుకుంటుంది.. ఇతర కంపెనీలు ఇండస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, బ్రూక్‌ఫీల్డ్‌లు కూడా ఆర్‌కామ్‌ టవర్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.  రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌-ఐడియా సెల్యులార్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్‌ తన స్పెక్ట్రమ్‌ హోల్డింగ్స్‌ను పెంచుకుంటోంది. ఈ క్రమంలో నష్టాలతో ఉన్న కంపెనీల ఆస్తులను కొనుగోలు చేస్తోంది. ఇటీవల ఎయిర్‌టెల్‌ చేసిన కొనుగోళ్లలో టెలినార్‌ ఇండియా,  ఎయిర్‌సెల్‌ 4జీ స్పెక్ట్రమ్‌, టికోనా, టాటా టెలిసర్వీసులున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement