రూ. 1590కే విమాన టికెట్లు | AirAsia India Announces Festive Sale, Tickets From Rs 1,590 on Offer | Sakshi
Sakshi News home page

రూ. 1590కే విమాన టికెట్లు

Oct 20 2015 2:32 PM | Updated on Sep 3 2017 11:15 AM

రూ. 1590కే విమాన టికెట్లు

రూ. 1590కే విమాన టికెట్లు

దసరా, సంక్రాంతి సీజన్లలో ఇళ్లకు వెళ్లడానికి బస్సు, రైలు టికెట్లు దొరకడం లేదా? అయినా ఏమీ ఆందోళన అక్కర్లేదు. హాయిగా విమానం ఎక్కి మరీ వెళ్లిపోవచ్చు.

దసరా, సంక్రాంతి సీజన్లలో ఇళ్లకు వెళ్లడానికి బస్సు, రైలు టికెట్లు దొరకడం లేదా? అయినా ఏమీ ఆందోళన అక్కర్లేదు. హాయిగా విమానం ఎక్కి మరీ వెళ్లిపోవచ్చు. అక్టోబర్ 20వ తేదీ.. అంటే మంగళవారం నుంచి 2016 ఫిబ్రవరి 29 వరకు చేసే ప్రయాణాలకు సంబంధించిన విమాన టికెట్లకు ఎయిర్ ఏషియా ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. నవంబర్ ఒకటో తేదీలోగా టికెట్లు బుక్ చేసుకుంటే, పన్నులన్నీ కలిపి కనిష్ఠంగా రూ. 1590కే ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి కొచ్చి, గోవా మార్గాల్లో వెళ్లడానికి రూ. 1590, అదే బెంగళూరు నుంచి పుణె అయితే రూ. 1990 ధర పెట్టిన ఎయిర్ ఏషియా, ఢిల్లీ- బెంగళూరు మార్గంలో మాత్రం రూ. 4290గా టికెట్ ధర నిర్ణయించింది. ఢిల్లీ-గోవా మార్గంలో రూ. 3990, గువాహటి -ఇంఫాల్ మార్గంలోను, ఢిల్లీ-గువాహటి మార్గంలోను రూ. 1690కి టికెట్లు ఉన్నాయి. నవంబర్ 1వ తేదీలోగా ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి.

వచ్చే ఏడాది ప్రయాణం మరింత చౌక
ఎయిర్ ఏషియా విమానాల్లో వచ్చే సంవత్సరం వేసవి నుంచి ప్రయాణాలు మరింత చవగ్గా చేయొచ్చు. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి అక్టోబర్ 29 వరకు చేసే ప్రయాణాలకు కనిష్ఠ ధర రూ. 1299 అని ప్రకటించారు. ఈ ఆఫర్ కింద టికెట్లను మాత్రం అక్టోబర్ 25లోగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలు పండుగ సీజన్లు కాబట్టి ఈ సమయంలో ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకోడానికి స్పైస్‌జెట్ సంస్థ అర్ధరాత్రి ప్రయాణాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తరహా విమాన సర్వీసులు ప్రధానంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో కూడా ఇలాంటి విమాన సర్వీసులను ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement