భారీగా పెరిగిన బంగారం ధరలు..!

Ahead Of Diwali Gold Prices Surged To A Near Six Year High - Sakshi

ముంబై : బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీపావళి పండుగ సందర్భంగా కొనుగోళ్ల సందడి పెరుగుతుండటంతో బంగారం ధర ఆరేళ్ల గరిష్ఠానికి చేరింది. నేడు బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 32, 650గా నమోదైంది. బంగారం ధర దూసుకుపోతుండగా.. వెండి ధర మాత్రం దిగొచ్చింది. పరిశ్రమల నుంచి డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్‌లో వెండి ధర రూ. 40 తగ్గి 39, 200కి నమోదైంది.

దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం 30 రూపాయల చొప్పున పెరిగి రూ.32,650గా, రూ.31,500గా నమోదైంది. నవంబర్ 29, 2012 తర్వాత ఇదే అత్యధిక ధర. 2012, నవంబర్‌ 29న 10 గ్రాముల బంగారం ధర 32, 940రూపాయలకు చేరింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ రోజే రికార్డ్‌ స్థాయిలో బంగారం ధర పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top