
ముంబై: మొండి బకాయిలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొన్ని బ్యాంకులపై దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. నికర మొండి బకాయిలు 6 శాతం దాటిపోవడంతో ఆయా బ్యాంకులకు సంబంధించి ఆర్‌బీఐ తగిన దిద్దుబాటు చర్యలకు అవకాశం ఉందని ఒక నివేదికలో పేర్కొంది.
ఇదిలాఉండగా, దుస్తుల ఎగుమతులకు ఇటు దేశీయంగానూ, అటు అంతర్జాతీయంగానూ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు మరో నివేదికలో ఇక్రా పేర్కొంది. కొత్త పన్నుల విధానం, ఎగుమతులకు ప్రోత్సాహం, అంతర్జాతీయ పోటీ పరిస్థితుల వంటి అంశాలపై దుస్తుల పరిశ్రమ వృద్ధి ఆధారపడి ఉంటుందని నివేదిక పేర్కొంది.