అర్ధరాత్రి మావోల హల్‌చల్‌ | maoists hulchal in pinapaka bhadradri district | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి మావోల హల్‌చల్‌

Jan 27 2018 5:13 AM | Updated on Oct 9 2018 2:53 PM

maoists hulchal in pinapaka bhadradri district - Sakshi

పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం భూపతిరావుపేట సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు హల్‌చల్‌ చేశారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఒకరిపై కాల్పులు జరపగా, మరొకరిని గొడ్డలితో నరికి చంపారు. గ్రామ శివారు గోదావరి ఒడ్డున గిరిజన సొసైటీ పేరుతో ఇసుక క్వారీ నడుస్తోంది. ఇక్కడికి వచ్చిన మావోయిస్టులు నాలుగు లారీలు, మూడు జేసీబీలు, ఒక డోజర్, ఒక ట్రాక్టర్‌ను దహనం చేశారు.

అనంతరం జానంపేట పంచాయతీ సుందరయ్యనగర్‌కు (వలస గొత్తికోయ గ్రామం) చెందిన మడివి రమేశ్, జోగయ్యలను పోలీస్‌ఇన్‌ఫార్మర్లుగా రమేశ్‌పై కాల్పులు జరిపారు. జోగయ్య(42)ను గొడ్డలితో నరికి చంపారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ మణుగూరు కమిటీ పేరుతో లేఖలు వదిలారు. 45 మంది మావోయిస్టులు ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement