' తన నియోజకవర్గానికి అరకొరగానే నిధులొస్తున్నాయని, వాటితోనే ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు' బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు.
గుంటూరు జిల్లా : ' తన నియోజకవర్గానికి అరకొరగానే నిధులొస్తున్నాయని, వాటితోనే ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు' బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. రాజకీయాలంటే ఎన్నికలప్పుడే చూడాలని, అనంతరం అభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
కోన ప్రభాకర్‌రావు 18వ నాటక పరిషత్ సందర్భంగా శనివారం బాపట్లలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్నానని, పార్టీ ఏ పిలుపు ఇచ్చినా బాపట్లలో విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.