breaking news
MLA funds
-
ఎమ్మెల్యే నిధులతో మాస్కులు
భువనేశ్వర్: కరోనా వ్యతిరేక పోరులో మాస్కు బలమైన ఆయుధం. సమాజంలో బలహీన వర్గాలకు అనుకూలమైన రీతిలో నాణ్యమైన మాసు్కలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టాలి. ఈ కార్యకలాపాల కోసం ఎమ్మెల్యే ల్యాడ్స్ నుంచి రూ. 50 లక్షల వరకు వెచ్చించాలని ముఖ్యమంత్రి కోరారు. మిషన్ శక్తి సిబ్బంది ఇస్తామన్న మాసు్కలను సేకరించి సేకరించి బీదలకు పంపిణీ చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో కోవిడ్ నిర్వహణ పరిస్థితులను బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. హెల్ప్‌డెస్క్ సిబ్బంది స్పందించాలి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్ రోగుల కుటుంబీకులు, బంధుమిత్రుల ఆవేదన పట్ల మానవీయ దృక్పథంతో మసలుకోవాలి. బాధితుల ఆరోగ్య స్థితిగతులకు సంబంధించిన సమాచారాన్ని హెల్ప్‌డెస్క్ సిబ్బంది బంధువులకు అందించి ఊరట కలిగించాలని హితవు పలికారు. కోవిడ్ ఆస్పత్రుల్లో లభ్యమవుతున్న సేవలు, చికిత్స, సదుపాయాలు, రోగుల ఆరోగ్య స్థితిగతుల తాజా సమాచారం తెలియజేసేందుకు హెల్ప్‌డెస్క్‌లను మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్త కుమార్ మహాపాత్రో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అభయ్, ముఖ్యమంత్రి 5టీ కార్యదర్శి వి. కె. పాండ్యన్, కోవిడ్ పర్యవేక్షకులు నికుంజొ బిహారి ధొలొ, సత్యవ్రత సాహు, విష్ణుపద శెట్టి, కెంజొహార్, మయూర్భంజ్ జిల్లాల కలెక్టర్లు, కటక్, భువనేశ్వర్ నగర పాలక సంస్థల కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు. బాధిత కుటుంబీకులకు సమాచారం కోవిడ్ ఆస్పత్రుల్లో చేరిన బాధితుల ఆరోగ్య సమాచారం వారి కుటుంబీకులకు ఎప్పటికప్పుడు చేరాలి. ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది, యంత్రాంగం మానవతా దృక్పథంతో మసలుకోవాలి. కోవిడ్ నిర్వహణ రంగంలో టీకాల ప్రదానం కీలకమైన అంశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీకాల ప్రదాన కేంద్రానికి ప్రజలు సునాయాశంగా చేరి ఇబ్బంది పడకుండా టీకాలు వేసుకునేందుకు సౌకర్యాలు కల్పించాలి. ఈ ప్రాంగణాల్లో రద్దీ నివారించి కోవిడ్ – 19 నిబంధన భౌతిక దూరానికి ప్రాధాన్యం కల్పించాలి. టీకాలు వేసే చోటు, వేళల సమాచారం సంబంధిత వ్యక్తులకు ముందస్తుగా తెలియజేయడంతో ఇది సాధ్యమతుందని నవీన్ పట్నాయక్ అభిప్రాయ పడ్డారు. ఇంటింటి సర్వే అఖిల పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్రో తెలిపారు. ఇంటింటా కరోనా రోగ లక్షణాలు కలిగిన బాధితుల సర్వే చేపడతారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా కలెక్టర్లు ప్రధానంగా ఆక్సిజన్ సంబంధిత వ్యవహారాలతో హెల్ప్ డెస్కు కార్యకలాపాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. -
ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్ష.. ఆ నియోజకవర్గాలపై వివక్ష..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్యే అంటే హోదా, గౌరవం. ఎమ్మెల్యేలకు హక్కులతో పాటు బాధ్యతలూ ఉంటాయి. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే చంద్రబాబు ఐదేళ్ల పాలన అందుకు భిన్నంగా నడిచింది. బాబు అలా నడిపించారు. ఆయన పాలన నియంతృత్వ పోకడలను తలపించింది. ఎమ్మెల్యేల హక్కులను, బాధ్యతలను కాలరాసింది. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా ప్రభుత్వ పరంగా నియోజకవర్గాలకు కేటాయించిన నిధులు వారి ప్రతిపాదనల ద్వారానే ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు చేయాల్సి ఉంది. ఇది ఆనవాయితీ కూడా. అయితే గత ఐదేళ్లలో చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకే హక్కులు, బాధ్యతలు కల్పించిన బాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పూచిక పుల్లల్లా చూశారు. వారికి నిధులు ఇవ్వలేదు. బాధ్యతలు పంచలేదు. ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపించారు. వారికి ఇవ్వాల్సిన నిధులను ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యేల పేరున ఏకంగా జీవోలే జారీ చేసి మంజూరు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలిగించారు. ప్రజా తీర్పును అగౌరవ పరిచారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిధులివ్వకపోగా ప్రలోభాలు జిల్లాలో మార్కాపురం, యర్రగొండపాలెం, సంతనూతలపాడు, గిద్దలూరు, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జంకె వెంకటరెడ్డి, డేవిడ్ రాజు, ఆదిమూలపు సురేష్, ముత్తుమల అశోక్‌రెడ్డి, పోతులరామారావు, గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా ప్రలోభాలకు గురిచేయడంతో మార్కాపురం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జంకె, సురేష్ మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఏ ప్రతిపాదనలు ఇచ్చినా ప్రభుత్వం వాటిని పక్కన బెట్టింది. దీంతో ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడింది. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను సైతం ఏకపక్షంగా అమలు చేశారు. అభివృద్ధి పనులు వారు సూచించిన చోటే చేపట్టారు. స్థానిక శాసన సభ్యులు ప్రతిపాదనలిచ్చినా అ«ధికారపార్టీ నేతల ఒత్తిడితో అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో అభివృద్ది పనులు కుంటు పడ్డాయి. మరోవైపు ఓడిపోయిన వ్యక్తుల పేరున అభివృద్ధి పనులకు సంబంధించి ఏకంగా జీఓలు జారిచేసి చంద్రబాబు సర్కారు కొత్త ఆచారానికి తెరలేపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ♦ మార్కాపురం నియోజకవర్గంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు దాదాపు నిలిచిపోయాయి. టన్నెల్–1 పనులు రెండు నెలలుగా పూర్తిగా నిలిచిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇక ఈ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ, పునరావాసం పనులు ఎప్పుడో ఆగిపోయాయి. మార్కాపురం శివారులోని సుందరయ్య కాలనీ ప్రాంతంలో 350 మంది పేదలు ఏళ్ల తరబడి నివసిస్తున్నారు. వీరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అధికారులకు పలుమార్లు విన్నవించడమే కాకుండా అసెంబ్లీలో సైతం ఎమ్మెల్యే మాట్లాడినా పట్టించుకోలేదు. పొదిలి మండలం కేశవాపురం, మార్కాపురం మండలం పెద్దనాగులవరంలలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములున్నా నిరుపయోగంగా మారాయి. వాటి అభివృద్ధిని ప్రభుత్వం గాలికొదిలింది. పొదిలి టౌన్, రూరల్ పరిధిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.52 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో గతంలో ప్రతిపాదనలు పంపగా చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది. ఎమ్మేల్యే పలుమార్లు కోరినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించలేదు. ♦ సంతనూలపాడు నియోజకవర్గంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో పునరావాస పనులు పెండింగ్‌లో ఉన్నాయి. చంద్రబాబు సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో ఈ పనులు పూర్తికాలేదు. ప్రాజెక్టు పరిధిలో కాలువ పనులు సైతం పూర్తి కాకపోవడంతో ప్రాజెక్టుకి నీరు చేరినా సక్రమంగా పొలాలకు చేరే పరిస్థితి లేదు. బోడపాలెం, బొడ్డూరిపాలెం రోడ్లు చాలాకాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా తాగునీటి సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. సంక్షేమ పథకాలకు సంబంధించి పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా గృహాలు అరకొరగా కూడా మంజూరు చేయలేదు. ఎమ్మెల్యే ప్రతిపాదనలు ఇచ్చినా అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు పట్టించుకోవడంలేదు. ఎమ్మెల్యేలు నేరుగా నిధులు అడిగినా పట్టించుకోని బాబు వైఎస్సార్ సీపీ శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులివ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సురేష్, జంకె ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం కోరారు. ఒక్కో నియోజకవర్గంలో పనులకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. అయినా కూడా ముఖ్యమంత్రి స్పందించలేదు. -
ఎమ్మెల్యే నిధులు 250 శాతం పెంచుతాం!
వరుసపెట్టి కష్టాలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ఇప్పుడు సరికొత్త రాగం మొదలుపెట్టింది. ఎమ్మెల్యేల స్థానిక ప్రాంత అభివృద్ధి (లాడ్) నిధులను ఒకేసారి 250 శాతం పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఈ నిధలు ప్రస్తుతం రూ. 4 కోట్లు ఉండగా, వాటిని రూ. 14 కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని అధికారులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ఈ ప్రతిపాదన పంపామని, నిబంధనల ప్రకారం ఢిల్లీ జలబోర్డు పనులకు కోటి రూపాయలు కేటాయించి, మిగిలిన వాటిని ఇతర పనులకు ఇస్తామని ఒక అధికారి చెప్పారు. దాంతో ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనులకు పెద్దగా నిధులు ఉండట్లేదని, దాంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రభుత్వం తలపెడుతోందని ఆయన అన్నారు. అయితే.. వచ్చే సంవత్సరం ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిధులు కేటాయించినట్లు చెబుతున్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే నిధులు రూ. 2 కోట్లు ఉండగా.. షీలాదీక్షిత్ ప్రభుత్వం 2011లో వాటిని రూ. 4 కోట్లకు పెంచింది. -
'నియోజకవర్గానికి అరకొర నిధులు'
గుంటూరు జిల్లా : ' తన నియోజకవర్గానికి అరకొరగానే నిధులొస్తున్నాయని, వాటితోనే ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు' బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. రాజకీయాలంటే ఎన్నికలప్పుడే చూడాలని, అనంతరం అభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. కోన ప్రభాకర్‌రావు 18వ నాటక పరిషత్ సందర్భంగా శనివారం బాపట్లలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్నానని, పార్టీ ఏ పిలుపు ఇచ్చినా బాపట్లలో విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. -
పోరాడి సాధించుకుందాం...
ఈ వార్డుల్లో సామాజిక మరుగుదొడ్ల సమస్యతో పాటు చాలా సమస్యలు మున్సిపల్ కమిషనర్ పరిష్కరించవలసినవే. ఎమ్మెల్యే నిధుల నుంచి నేను మంజూరు చేసిన పెలైట్వాటర్ స్కీంలు పాడైపోతే... ఆ వార్డు వాసులను సొంత డబ్బులతో బాగుచేసుకోమంటే ఎలాగ ? బంగారమ్మకాలనీలో గిరిజనులకు ఇళ్లపట్టాలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చెబుతుండడం విచారకరం. ఈ విషయమై తహశీల్దార్‌తో మాట్లాడతాను. ఇళ్ల స్థల పట్టాలు పొందని గిరిజనులందరికీ న్యాయం జరిగేలా చేస్తాను. 11వ వార్డు చిన్నవీధిలో సామాజిక మరుగుదొడ్లు మూడేళ్లకిందట నిర్మిస్తే కేవలం ఒక నెలమాత్రమే వినియోగంలో ఉన్నాయి, మోటారు పాడైపోవడంతో నిరుపయోగంగా మారాయి. మోటారుకు మరమ్మతులు జరిపేలా చేస్తాను. మురుగుకాలువకు ఆనుకుని రిటర్నింగ్‌వాల్ నిర్మించాల్సివుంది. అన్నింటికీ మించి అన్ని అర్హతలున్న వారికి పింఛన్లు ఉద్దేశపూర్వకంగా తొలగించారు. అర్హులందరికీ పింఛన్లు పునరుద్ధరించేందుకు తొలుత లోకాయుక్తను ఆశ్రయిస్తాం, ఆపై అవసరమైతే బాధితుల తరఫున న్యాయ స్థానాన్ని ఆశ్రయించి న్యాయం జరిగేలా చేస్తాను. అవి సాలూరు మున్సిపాలిటీ శివారు మురికివాడలైన 11, 14 వార్డులు. ఇక్కడ దళితులు, గిరిజనులు, నిరుపేదలు ఇలా అన్ని వర్గాల వారు సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. తాగునీరందక, సీసీరోడ్లు, సామాజిక మరుగుదొడ్లు లేక, మురుగు కాలువలు పాడై, పింఛన్లు కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని మురుగు నీరంతా 11వ వార్డులో చిన్నవీధిని ఆనుకుని ఉన్న ప్రధాన కాలువ గుండా ప్రవిహ స్తోంది. దాని నుంచి వచ్చే దుర్గంధంతో వార్డు వాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కాలువకు ఆనుకుని ఉన్న గృహాలు నిత్యం కోతకు గురవుతున్నాయి. ఆయా వార్డుల్లో నివసిస్తున్న పేదల కష్టాలు, అవస్థలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. పేదలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలపై పోరాడి గెలుద్దామని వారికి ధైర్యం చెప్పారు. రాజన్నదొర : నాపేరు పీడిక రాజన్నదొర. సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేను. మీ సమస్యలు తెలుసుకునేందుకు సాక్షి తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీవద్దకు వచ్చా ను. రాజన్న : చెప్పమ్మా... నీ పేరేంటి? ముగదమ్మ : నాపేరు జంగం ముగదమ్మ బాబు. భర్త చనిపోయాడు. సెంటు భూమిలేదు. రాజన్న : ఏంటి నీ సమస్య? ముగదమ్మ : నాకు ఐదు ఎకరాల భూమి ఉందని వచ్చే పింఛన్‌ను ఆపేశారు బాబు. నాకు భూమైనా ఇప్పించండి, లేపోతే పింఛనైనా ఇప్పించండి బాబు. రాజన్న: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పింఛన్లు ఇచ్చారు. నేడు వాటిని తొలగించేశారు. లేని భూమిని ఎలాగూ ఇప్పించలేం. న్యాయంగా రావాల్సిన పింఛన్ వచ్చేలా చేసేందుకు తహశీల్దార్, కలెక్టర్‌ను కలిసి మంజూరయ్యేలా కృషిచేస్తాను. రాజన్న : నీపేరేంటి? అప్పయ్యమ్మ: నాపేరు అప్పయ్యమ్మ బాబూ. రాజన్న: పెద్దావిడా చెప్పునీసమస్య ఏంటి ? అప్పయ్యమ్మ: నాకు గంజిపోసే వారే లేరుబాబు. రాజన్న: పింఛన్ వస్తోందా? అప్పయ్యమ్మ: ఆపీశారు బాబు. ఆధార్‌కార్డులో నావయసు 26సంవత్సరాలని ఉందట, అందుకే ఆపీశారట. రేషన్‌కార్డులో 60 ఏళ్లుగా వుందట. రాజన్న: అదేంటీ నిన్ను చూస్తేనే 70 ఏళ్లుంటాయని తెలుస్తోంది కదా. రాజన్న: పెద్దాయనా చెప్పు నీ సమస్య ఏంటి ? డోల లక్ష్మణ : నాపేరు డోల లక్ష్మణ. చిన్నవీధి పక్కగుండానే పెద్ద మురుగుకాలువ వెళ్తోంది. చాలా ఇళ్లు మురుగుకాలవను ఆనుకుని వున్నాయి. వర్షం పడితే ఇళ్లు కోతకు గురౌతున్నాయి. రాజన్న: ఏంచేస్తే ఇళ్లు పాడవకుండా ఉంటాయి? లక్ష్మణ : ఇళ్లు కోతకు గురవకుండా గ్రావెల్ వేసి, రిటైనింగ్ వాల్‌ను ఎత్తుగా కట్టాలి. రాజన్న: ముసలమ్మా, నీపేరేంటమ్మా? నీకొచ్చిన కష్టమేంటి? సామాలమ్మ; నాపేరు బిరుసు సామాలమ్మ. నా భర్త పోయాడు. పింఛన్ ఆపేశారు బాబూ. రాజన్న: వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి కదా... అంతేగాక భర్త చనిపోవడంతో వితంతు పింఛన్‌కు అర్హురాలివే. తప్పక మంజూరయ్యేలా ప్రయత్నిస్తాను. రాజన్న:అమ్మానీపేరేంటి?సమస్య చెప్పు. పైడిరాజు :నాపేరు పైడిరాజు.మొన్నటి తుపానుకు ఇంటి గోడ పడిపోయింది. రాజన్న: ప్రభుత్వం ఆదుకుందా? పైడిరాజు: పైసాఇవ్వలేదు సార్. కూలిచేసుకు బతేకేవాళ్లం. రాజన్న: నీపేరేంటమ్మ? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? పార్వతి: నాపేరు డోల పార్వతి బాబు. ఇళ్లు కట్టుకోమన్నారు. లోన్ ఇస్తామన్నారు. బిల్లు ఇవ్వడంలేదు. అప్పులపాలైపోయాను. రాజన్న: నీలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. గృహనిర్మాణ రుణాల బిల్లు ల విషయమై శాసనసభలో మాట్లాడాను. మంత్రి నుంచి గానీ, సీఎం నుంచిగానీ సరైన సమాధానం రాలే దు. రానున్న శాసనసభా సమావేశాలలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. రాజన్న: అమ్మా నీపేరేంటి? వ్యాపా రం ఎలాగుంది? గంగమ్మ: నాపేరు గంగమ్మ సార్. కాయగూరలు వ్యాపారంలో అప్పుడప్పుడూ నష్టం వస్తోంది. రాజన్న: ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చిందా? లేకపోతే సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నావా? గంగమ్మ: నాకు 45ఏళ్లు వచ్చేశాయని లోన్ ఇవ్వమనేశారు సార్. రాజన్న: ప్రభుత్వం అలాంటి రూల్స్ పెడుతోంది మరి. రాజన్న: మరియమ్మా బాగున్నావా? మరియమ్మ: ఏం బాగు బాబూ. దీపావళికి సరదాగా బాణసంచా తయారుచేస్తున్నపుడు పేలిననాబిడ్డ అనీల్ ప్రాణాలు పోయాయి. మీకు తెలుసుకదా. రాజన్న: అధికారులు వచ్చి పరామర్శించారా?, ఆదుకున్నారా? మరియమ్మ: మీరు తప్ప ఏఒక్కళ్లూ రాలేదు సార్. దళితులమై పుట్టడమే మేం చేసిన పాపమా?, పేదలం కావడమే మేం చేసిన నేరమా? రాజన్న:ఆదుకోవాలని కలెక్టర్‌కు, సీఎంకు, విపత్తులశాఖకు లేఖలు రాశాను. అనంతరం ఇదే ప్రమాదంలో ఒక బిడ్డను పోగొట్టుకుని, మరో బిడ్డ రెండు చేతులు తీసేయాల్సి వచ్చిన బిరుసు కళావతి ఇంటికి వెళ్లారు. రాజన్న: అమ్మా కళావతి బాబుకు ఇప్పుడు ఎలావుంది? కేజీహెచ్‌లో చికిత్స చేస్తున్నారుకదా? ఎందుకు తీసుకువచ్చేశారు? కళావతి: అక్కడ డాక్టర్లు స్ట్రైక్ చేస్త్తున్నారట బాబూ, పంపేశారు. రాజన్న: బాబు(కామేశ్వరరావు) మాట్లాడుతున్నాడా? కళావతి: మాట్లాడలేక పోతున్నాడు. రాజన్న: సరే మరోమారు సీఎం దృష్టికి తీసుకువెళ్లి వాకతిప్ప ఘటనలో బాధిత కుటుంబాల మాదిరిగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తాను. రామమందిరం వద్దకు వెళ్లగానే పలువురు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆయన్ను చుట్టుముట్టారు. రాజన్న; ఏమ్మా!, మీ అందరి పింఛన్లు ఆపేశారా? పింఛన్ పోగొట్టుకున్న వారంతా: అవునుబాబు. రాజన్న : అర్హులందరికీ గతంలో లాగ పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నాను. నావంతు ప్రయత్నిస్తాను. మీరు కౌన్సిలర్ అప్పారావును కలసి దరఖాస్తులు ఇవ్వండి. రోడ్డుపై రిక్షాలో చతికిలబడిన వృద్ధ వికలాంగురాలును పలకరిస్తూ... రాజన్న: అమ్మా నీపేరేంటి? కృష్ణమ్మ: నాపేరు గొంప కృష్ణమ్మ బాబూ. పింఛన్ ఆపేశారు. రాజన్న: నీకు పింఛన్ ఎప్పటినుంచి వస్తోంది? కృష్ణమ్మ: మీరే మంజూరు చేశారు బాబూ... నడవలేను,( అంతలో ఆమె భర్త ఆమె వికలాంగ ధ్రువీకరణ పత్రాలను చూపారు).60శాతం వికలాంగత్వం వున్నా, వయసు 70ఏళ్లు పైబడినా పింఛన్ ఆపేయడం దారుణమైన విషయమన్నారు. రాజన్న: అమ్మా నీపేరేంటి? రోజమ్మ: రివకల రోజమ్మ బాబూ రాజన్న: నా భార్యపేరు, నా తల్లి పేరుకూడా రోజమ్మే.(అక్కడున్నవారంతా మనసారా నవ్వుకున్నారు) రాజన్న: చెప్పు ఎలావుంది ఇడ్లీల వ్యా పారం? రోజమ్మ: రోజుకు 20రూపాయలు లాభం వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు లోన్ ఇవ్వమంటే వయసై పోయిందంటున్నారు. రాజన్న: అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడుతూ.., ఏమ్మా, పిల్లలకు ఆహారంగా ఏం పెడతున్నారు ? అంగన్వాడీ కార్యకర్తలు : 11గంటలకు గుడ్లు, 12గంటలకు భోజనం, 3గంటలకు కుర్కురే, శనగలు ఇస్తున్నాం. రాజన్న: ఏమైనా సమస్యలున్నాయా? అంగన్వాడీ కార్యకర్తలు : పిల్లలకు రోజూ పప్పు అన్నం పెడుతున్నారని వారి తల్లిదండ్రులు అడుగుతున్నార్ సార్, మాకు అధికారులు అవే ఇస్తున్నారు మరి. అలాగే అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉంది. భవనం మంజూరయ్యేలా చేయండి సార్. పిల్లలు ప్లేట్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. సెంటర్‌కు ప్లేట్లు మంజూరు చేస్తే బాగుంటుంది సార్. రాజన్న: భవనం మంజూరయ్యేలా తప్పకుండా చేద్దాం. ఈవిషయమై తహశీల్దార్, కలెక్టర్‌తో మాట్లాడతాను. అక్కడినుంచి సామాజిక మరుగుదొడ్ల దగ్గరకు మహిళలతో వెళ్లారు. రాజన్న: ఏంటి మీసమస్య? మహిళలు: మూడేళ్ల కిందట సామాజిక మరుగుదొడ్లను కట్టారు. ఒక్క నెలే ఉపయోగపడింది. మోటారు పాడైందని వదిలేశారు. బాగుచేయండని మున్సిపాలిటీవారిని అడిగితే మీరే ఇంటికి 100రూపాయల చొప్పు న వసూలు చేసుకుని బాగుచేసుకొమ్మంటున్నారు. గెడ్డఒడ్డున కాలకృత్యాలను తీర్చుకోడానికి ఆడాళ్లం వెళ్లడం కష్టంగాఉంటోంది. రాజన్న: సామాజిక మరుగుదొడ్లను నిర్వహించడం ప్రభుత్వం బాధ్యత. నిరుపేదలైన దళితులను... మీరే బాగుచేసుకోండని అధికారులు చెప్పడం సరైందికాదు. అక్కడి నుంచి పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.. రాజన్న: ఏమ్మా నీకేమైంది?, నీపేరేంటి, నీఊరేంటి? రాధ: నాపేరు కొర్ర రాధ. మా ఊరు ములగవలస, పాము కరిచింది. అందుకే ఇక్కడకు వచ్చాను. రాజన్న: నొప్పి తగ్గిందా? రాధ: బాధ తగ్గలేదు. పక్కనేవున్న డాక్టర్ రామ్మూర్తిని పిలిచి సరిగా చూసుకోండని ఆదేశించారు. రాజన్న: నీకేమయింది? నీపేరేంటి? మల్లేశ్వరి: నాపేరు మల్లేశ్వరి, మా ఊరు నెలిపర్తి. అక్కడే ఉన్న డాక్టర్ రామమూర్తి కలుగుజేసుకుంటూ నిమోనియాతో బాధపడుతోంది సార్. ఊపిరితిత్తుల్లో చీము చేరిందని అనుమానం. వైద్యం చేస్తున్నామన్నారు. రాజన్న: డాక్టర్.. చిన్నచిన్న విషయాలకు రిఫర్ చేసేయకండి. డాక్టర్ రామ్మూర్తి: పంపడం లేదుసార్. రాజన్న: ఎస్పీహెచ్ఓ గారూ.... ఏమైనా సమస్యలున్నాయా..? ఎస్పీహెచ్ఓ: ఆస్పత్రిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత వుంది. బెడ్స్ సప్లైలేదు. ప్రహరీ కూలిపోవడంతో ఇబ్బందిగావుంది. రాజన్న: ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను. రోగులకు ప్రయోజనం కలిగేలా., ఆస్పత్రి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాను. అక్కడి నుంచి నేరుగా బంగారమ్మకాలనీలోని గొడగలవీధి చేరుకున్నారు... రాజన్న: ఏమ్మా నీపేరేంటి?, ఏమైనా సమస్యలున్నాయా? ఈశ్వరమ్మ: నాపేరు ఈశ్వరమ్మ. కుళాయినీరు చిన్నధార వస్తోంది. చాలడంలేదు. మీరు కట్టించిన పెలైట్ వాటర్ స్కీం పాడైంది. బోరింగు పాడైంది. రాజన్న: మున్సిపాలిటీవారు కావాలనే లేని సమస్యలు సృష్టిస్తున్నట్టుగా ఉం ది. తాగునీటి సమస్య తలెత్తకుండా పెలైట్ వాటర్ స్కీంలు మంజూరు చేస్తే మరమ్మతులు జరపకుండా వాటిని వదిలేస్తున్నారు. ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు ఆపేశారు. ఆ నిధులు వస్తే కేటాయిస్తాను. ఈవిషయమై మున్సిపల్ కమిషనర్, కలెక్టర్‌తో మాట్లాడతాను. కాలనీలోని ఎరుకల వీధికి వెళ్లారు... రాజన్న: నీపేరేంటమ్మ? సామాలమ్మ: నాపేరు దాసరి సామాలమ్మ. మాలో చాలామందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేశారని మళ్లీ పట్టాలు ఇవ్వడం లేదు సార్. మాకు ఇళ్ల పట్టాలు ఎప్పడిచ్చారో మాకే తెలియడం లేదు. ఆఫీసర్లేమో ఇచ్చీసామనిచెప్పి, ఇవ్వడంలేదు. అందుకే పాకలలో మగ్గుతున్నాం. మీరే న్యాయం చేయాలి. రాజన్న: ఇళ్ల స్థల పట్టాలవిషయంలో తహశీల్దార్, కలెక్టర్‌తో మాట్లాడతాను. ప్రయోజనం కలిగేలా కృషిచేస్తాను. పక్కనే ఉన్న కాలనీ నాయకుడు దాసరి భాస్కరరా వును కాలనీ ప్రతినిధిగా సమస్యలు తెలపాలని కోరారు. భాస్కరరావు: కాలనీలో ఇళ్లస్థల పట్టాల సమస్యతోపాటు మరుగుదొడ్ల సమస్య, తాగునీటి సమస్య ఉన్నాయి సార్. కాలువల్లో పూడికలను సక్రమంగా తీయడం లేదు. మీరు మంజూరు చేసిన నాలుగు పెలైట్ వాటర్ స్కీంలలో రెండు పాడయ్యాయి. వాటిని మున్సిపాలిటీవారు బాగుచేయడంలేదు. రాజన్న: సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాడదాం. ధైర్యంగా ఉండండి. వస్తాను...!!మళ్లీ కలుద్దాం... -
రైల్వేగేట్లకుఎంపీ, ఎమ్మెల్యే నిధులు వాడాలి
దివంగత సీఎం వైఎస్ పాలసీని అమలు చేయాలి: టీపీసీసీ హైదరాబాద్ : పెండింగ్‌లో ఉన్న రైల్వే గేట్ల నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే నిధులను వినియోగించేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి అభిప్రాయపడ్డారు. పెన్షన్లు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, రేషన్‌కార్డులుసహా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని శుక్రవారం ఆయన ఆరోపించారు. ఒకే కుటుంబంలో వికలాంగుడు, వృద్ధుడు, వితంతువు ఉంటే.. అందులో ఒక్కరికే పెన్షన్ ఇవ్వడంవల్ల మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అర్హులైన వారందరికీ పెన్షన్లుసహా ప్రభుత్వ పథకాలన్నింటినీ వర్తింపజేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.