‘అధికార దుర్వినియోగం వల్లే టీడీపీ గెలుపు’ | ysrcp leader vasireddy padma takes on tdp over kakinada municipal election results | Sakshi
Sakshi News home page

‘అధికార దుర్వినియోగం వల్లే టీడీపీ గెలుపు’

Sep 1 2017 12:25 PM | Updated on Aug 10 2018 8:27 PM

కాకినాడలో డివిజన్ల వారీగా టీడీపీ నేతలు భారీగా డబ్బులు పంచారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

హైదరాబాద్‌ : అధికార దుర్వినియోగం వల్లే కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో కూడా అలాగే చేశారని అన్నారు. కాకినాడలో డివిజన్ల వారీగా భారీగా డబ్బులు పంచారని, పలుచోట్ల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఆమె వ్యాఖ్యానించారు.

అధికార దుర్వినియోగంతో గెలిచిన గెలుపు... గెలుపు కాదని అన్నారు. గతంలో ఉప ఎన్నికల్లో టీడీపీ చాలాసార్లు డిపాజిట్ కోల్పోయిందని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు. కాకినాడ, నంద్యాలలో అభివృద్ధికి ప్రజలు పట్టం గట్టారని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీల్లో ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని ఆమె ధ్వజమెత్తారు. మాయ మాటలు చెప్పడంలో చంద్రబాబు డిగ్రీ చేశారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement