భూమా అరెస్టును ఖండించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు | ysrcp condemns bhuma nagireddy arrest | Sakshi
Sakshi News home page

భూమా అరెస్టును ఖండించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు

Jul 5 2015 2:17 PM | Updated on May 29 2018 4:23 PM

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్:వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై అధికార పార్టీ అక్రమంగా అరెస్టు చేయడమే  కాకుండా దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. వైఎస్సార్  సీపీ ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఇదిలా ఉండగా, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ భూమాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మరో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. భవిష్యత్తులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా కోరుముట్ల హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement