సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళంవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది.
కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళంవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కార్యకర్తలు, విద్యార్థులతో ర్యాలీ చేపట్టి ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి సోమవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు.
కర్నూలులో కొత్తబస్టాండ్ నుంచి బంగారుపేట, ఆర్‌ఎస్ రోడ్, మౌర్యా ఇన్ సర్కిల్, రాజ్‌విహార్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే ధర్నా నిర్వహిస్తామన్నారు. మరో బృందం నంద్యాల చెక్‌పోస్టు నుంచి సి.క్యాంప్, మద్దూర్‌నగర్, విశ్వేశ్వరయ్య సర్కిల్ మీదుగా కలెక్టరేట్ చేరుకుని ధర్నాలో పాల్గొంటుందని వారు పేర్కొన్నారు.