జగన్కు మద్దతుగా కర్నూలు జిల్లాలో దీక్షలు | YSR Congress Protests in Kurnool District | Sakshi
Sakshi News home page

జగన్కు మద్దతుగా కర్నూలు జిల్లాలో దీక్షలు

Oct 9 2013 11:10 AM | Updated on Oct 22 2018 5:46 PM

జగన్కు మద్దతుగా కర్నూలు జిల్లాలో దీక్షలు - Sakshi

జగన్కు మద్దతుగా కర్నూలు జిల్లాలో దీక్షలు

వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లాలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి.

కర్నూలు: వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లాలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆత్మకూరులో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. 

డోన్‌లో బుగ్గన రాజారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సమైక్యాంధ్ర పోరు పాదయాత్ర 2వ రోజు కొనసాగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె జిల్లావ్యాప్తంగా జరుగుతోంది. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో శ్రీశైలంలో కుడిగట్టులో 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement