రాష్ట్ర విభజన విషయంలో సమన్యాయం కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన విషయంలో సమన్యాయం కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జంతర్మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులు పాల్గొననున్నారు. ఉదయం పది గంటలకు ధర్నా ప్రారంభం కానుంది.
కాగా సమస్యలకు పరిష్కారం చూపకుండా రాష్ట్ర విభజన సరికాదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు నిన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన విషయం తెలిసిందే. సమన్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన వారు... చేయలేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరారు.