తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జగ్గంపేట, రామచంద్రాపురం, కాకినాడ రూరల్ పరిధిలోని కార్యాలయాల్లో పార్టీ నేతలు జెండా ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నవీన్, యనమదల మురళీ, లింగం రవితోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.