వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించిన సిట్‌ | YS Vivekananda reddy murder: SIT begins probe, visits scene of crime | Sakshi
Sakshi News home page

వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించిన సిట్‌

Mar 16 2019 3:02 PM | Updated on Mar 16 2019 3:36 PM

YS Vivekananda reddy murder: SIT begins probe, visits scene of crime  - Sakshi

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సిట్‌ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సిట్‌ స్పెషల్‌ అధికారి అభిషేక్‌ మహంతి, అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ శనివారం వివేకానందరెడ్డి నివాసాన్ని పరిశీలించారు.

సాక్షి, పులివెందుల : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సిట్‌ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సిట్‌ స్పెషల్‌ అధికారి అభిషేక్‌ మహంతి, అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ శనివారం వివేకానందరెడ్డి నివాసాన్ని పరిశీలించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సిట్‌, క్లూస్‌ టీమ్‌తో పాటు ఫింగర్‌ ప్రింట్స్‌ నిపుణులు పరిశీలించారు.  అనంతరం వివేకానందరెడ్డి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీజీ అమిత్‌ గార్గ్‌ మాట్లాడుతూ..ప్రస్తుతం సిట్‌ టీమ్‌ను పర్యవేక్షిస్తున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కొన్ని కీలక ఆధారాలు లభించాయని, అన్ని విషయాలు ఆదివారం వెల్లడిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు కుటుంబసభ్యుల అశ్రు నయనాల మధ్య వివేకానందరెడ్డి అంత్యక్రియలు పులివెందులలో ముగిశాయి. చదవండి... (వైఎస్‌ వివేకా దారుణ హత్య...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement