వైఎస్సార్ సీపీ జనపథం | YS Jaganmohan Reddy's YSRCP Janapatham | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ జనపథం

Mar 19 2014 2:54 PM | Updated on Aug 20 2018 6:07 PM

స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనం మధ్య ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది.

రెండు ప్రాంతాల్లో జగన్, విజయమ్మ, షర్మిల పర్యటన

కదిరి నుంచి విజయమ్మ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి షర్మిల

ఆపై మహబూబ్‌నగర్ జిల్లాలో విజయమ్మ, నల్లగొండ జిల్లాలో షర్మిల ప్రచారం

తెలంగాణ జిల్లాల్లో జగన్ పర్యటన వివరాల షెడ్యూల్ త్వరలో విడుదల

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిల పార్టీ అభ్యర్థుల తరఫున వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సమరశంఖం పూరించారు. అలాగే విజయమ్మ అనంతపురం జిల్లా కదిరి నుంచి, షర్మిల శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ప్రచారం ప్రారంభించారు.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రచార షెడ్యూల్
  •  మార్చి 14: సాయంత్రం 4.00 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో బహిరంగసభ
  •  మార్చి 15: పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకులో రోడ్‌షో
  •  మార్చి 16: ప.గోదావరి జిల్లా కొవ్వూరులో రోడ్‌షో, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రోడ్‌షోతో పాటు సభ
  •  మార్చి 17: అమలాపురంలో రోడ్‌షో, ముమ్మడివరంలో రోడ్‌షో,
  • మార్చి 18 రామచంద్రపురంలో రోడ్‌షో, బహిరంగసభ, మండపేట-రోడ్‌షో
  •  మార్చి 19,20  నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మున్సిపాలిటీలలో పర్యటన
  • మార్చి 21: తేదీన మండపేట
  • మార్చి 22: తేదీన సామర్లకోట, పెద్దాపురం
  • మార్చి 23: తేదీన పిఠాపురం, గొల్లప్రోలు
  • మార్చి 24: తేదీన ఏలేశ్వరం, తుని ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు, రోడ్ షోలు ఉంటాయి.

విజయమ్మ ప్రచార షెడ్యూల్..

  •  మార్చి 16: అనంతపురం జిల్లాలోని కదిరిలో రోడ్‌షో, పుట్టపర్తిలో రోడ్‌షో, హిందూపురంలో బహిరంగసభ
  •  మార్చి 17: అనంతపురం జిల్లాలోని మడకశిరలో రోడ్‌షో, ధర్మవరంలో రోడ్‌షో, అనంతపురంలో బహిరంగసభ
  •  మార్చి 18 : అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గంలో రోడ్‌షో, రాయదుర్గంలో బహిరంగసభ.
  •  మార్చి 20 నుంచి గుంతకల్లు, గుత్తి, పామిడి, తాడిపర్తి, కర్నూలు జిల్లా బనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీలలో ప్రచారం.
  • మార్చి 21: తేదీన బనగానపల్లె, కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, నంద్యాల,
  • మార్చి 22: తేదీన బండి ఆత్మకూరు, వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, నందికొట్కూరు,
  • మార్చి 23: తేదీన డోన్, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో ఆమె బహిరంగ సభలు, రోడ్ షోలు ఉంటాయి.
     

 షర్మిల ప్రచార షెడ్యూల్..

  •  మార్చి 17 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో బహిరంగసభ
  •  మార్చి 18 : నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో బహిరంగసభ, నాయుడుపేటలో రోడ్‌షో, సూళ్లూరుపేటలో బహిరంగసభ.
  •  మార్చి 19 : నెల్లూరు జిల్లాలోని గూడూరులో రోడ్‌షో, నెల్లూరులో బహిరంగసభ.
  •  మార్చి 20 నుంచి కావలి, ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, చీరాల, అద్దంకి, కనిగిరి.
  • మార్చి 21: తేదీన గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ
  • మార్చి 22: తేదీన అద్దంకి, చిలకలూరిపేట, చీరాల
  • మార్చి 23: తేదీన బాపట్ల, పొన్నూరు, రేపల్లె
  • మార్చి 24: తేదీన తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల
  • మార్చి 25: తేదీన మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో వైఎస్ షర్మిల బహిరంగ సభలు, రోడ్ షోలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement