వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు బయల్దేరారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు బయల్దేరారు. పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. బస్సు ప్రమాద బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
ఈ రోజు ఉదయం పెనుగంచిప్రోలు మండలం ములపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 11 మంది మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని నందిగామ, జగ్గయ్యపేట ఆస్పత్రులకు తరలించారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా అదుపుతప్పి కల్వర్ట్‌లో పడింది. పోలీసులు దివాకర్ ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు.