నీటి కష్టాలు ఏవిధంగా తీరుస్తారు: వైఎస్ జగన్ | ys jagan mohan reddy visit chitravathi reservoir | Sakshi
Sakshi News home page

నీటి కష్టాలు ఏవిధంగా తీరుస్తారు: వైఎస్ జగన్

Apr 3 2015 6:26 PM | Updated on Jul 25 2018 4:09 PM

కమలాపురం గ్రామంలో వృద్ధురాలిని అప్యాయంగా పలకరిస్తున్న వైఎస్ జగన్ - Sakshi

కమలాపురం గ్రామంలో వృద్ధురాలిని అప్యాయంగా పలకరిస్తున్న వైఎస్ జగన్

పది టీఎంసీల నీరు ఉండాల్సిన చిత్రావతి రిజర్వాయర్ లో ఒక టీఎంసీ నీరుందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

కడప: పది టీఎంసీల నీరు ఉండాల్సిన చిత్రావతి రిజర్వాయర్ లో ఒక టీఎంసీ నీరుందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చిత్రావతి రిజర్వాయర్ లో నీటిమట్టాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తాగునీటి కోసం పులివెందుల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును కనీసం 10 శాతం కూడా నింపలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షన్నర ఎకరాల సాగుభూమి ఉంటే కనీసం కనీసం 12 వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పుడు ఉన్న ఒక్క టీఎంసీ నీటితో 0.95 టీఎంసీ నీరు డెడ్ స్టోరేజీలో ఉండాల్సిందే. ఇక ఏవిధంగా పులివెందుల సాగు, తాగు నీటి కష్టాలు తీరుస్తారని జగన్ ప్రశ్నించారు.

ఇటువంటి పరిస్థితులు పులివెందులలో ఉంటే రైతులకు సన్మానం చేస్తామంటూ చంద్రబాబు, దేవినేని చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. బ్రహంసాగర్ రిజర్వాయర్ కు 12 టీఎంసీల నీరు వైఎస్సార్ ఇస్తే.. చంద్రబాబు ఏ ఈడాది చుక్కనీరు కూడా ఇవ్వలేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

పోల్

Advertisement