
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జిల్లాకు రానున్నారు. గురువారం సాయంత్రం 3.40 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరిహెలీకాప్టర్ ద్వారా 4.25 గంటలకు భీమవరంలోని వీఎస్‌ఎస్ గార్డెన్‌కు చేరకుంటారు. 4.35 గంటలకు వీఎస్‌ఎస్ గార్డెన్‌లో జరిగే మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహానికి హాజరవుతారు. 4.55 గంటలకు తిరిగి బయలుదేరతారు. 5.10 గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకుని 5.45 గంటలకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు, నాయకులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.