డీఏ సోమయాజులు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ దిగ్బ్రాంతి

YS Jagan Mohan Reddy Express Grief Over Death Of YSRCP Leader DA Somayajulu - Sakshi

సాక్షి, గోపాలపురం : వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమయాజులు మృతి పట్ల వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

గత కొంత కాలంగా డీఏ సోమయాజులు శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. 1953లో ఉమ్మడి మహాబూబ్‌ నగర్‌ జిల్లా గద్వాల్‌లో సోమయాజులు జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి ఇండస్ట్రియల్‌ డెవలప్మెంట్‌ కార్వొరేషన్‌కు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. సోమయాజులు గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్‌ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top