
సానియా, సాకేత్ లకు జగన్ అభినందన
ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, సాకేత్ మైనేనిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
హైదరాబాద్: ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, సాకేత్ మైనేనిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ ద్వయం సానియా మీర్జా, సాకేత్ మైనేని టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్న తెలుగు కుర్రాడు సాకేత్ రెండు పతకాలు సాధించాడు.