వైఎస్‌ జగన్‌ది ప్రపంచ రికార్డు

YS Jagan Create World Record in Manifesto Implementation : Dadi Veerabhadra Rao - Sakshi

సాక్షి, అనకాపల్లి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేదని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తేల్చి చెప్పారు. అనకాపల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఓటమికి కారణం తన విధానాలు కాకుండా ప్రజలదే తప్పనే నియంత చంద్రబాబు అని విమర్శించారు. రాజధానిలో రైతుల నుంచి భూములు సేకరించి తన అనుచరులకు ధారాదత్తం చేయడం న్యాయమేనా? అని ప్రశ్నించారు.

ఐదు సంవత్సరాలుగా హైకోర్టును ఆంధ్రప్రదేశ్‌కు రాకుండా చేసిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సూపర్‌ ప్రధానిగా భావించుకొని ప్రత్యేక విమానాల్లో తిరిగిన బాబు సాధించిందేమీ లేదని పేర్కొన్నారు. మోదీ వ్యతిరేక సభల పేరుతో రాష్ట్రమంతా సభలు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేసి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు దేవాలయ భూములను కూడా వదల్లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పార్టీ మేనిఫెస్టోని 90 శాతం అమలు పరిచి ప్రపంచ రికార్డు సాధించారని ప్రశంసించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top