అరవింద సమేత బ్యానర్‌ కడుతూ .. | Young Man Died During Fixing Aravinda Sametha Veera Raghava Banners | Sakshi
Sakshi News home page

అరవింద సమేత బ్యానర్‌ కడుతూ యువకుడు మృతి

Oct 8 2018 11:35 AM | Updated on Oct 8 2018 11:48 AM

Young Man Died During Fixing Aravinda Sametha Veera Raghava Banners - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా బ్యానర్‌ కడుతుండగా కరెంట్‌ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  తాడేపల్లిగూడెంలోని శేషమహాల్‌ థియేటర్‌లో పండు అనే యువకుడు పని చేస్తున్నాడు.  ‘జూ.ఎన్టీఆర్‌’ కథానాయకునిగా నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా ఈ నెల 11న విడుదల కానున్న సందర్భంగా థియేటర్‌ ప్రాంగణంలో బ్యానర్లు కట్టే పనిని యాజమాన్యం పండుకు అప్పగించింది.

దీంతో బ్యానర్‌ కట్టే పనిలో అతడు తలమునకలై ఉండగా విద్యుత్‌ వైర్లు తగిలి కుప్పకూలాడు. ఇది గమనించిన థియేటర్‌ యాజమాన్యం అతడిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రికి తీసుకురాకముందే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పండు మృతితో తమకు సంబంధంలేదంటూ థియేటర్‌ యాజమాన్యం చేతులెత్తేసింది. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం పండు మృతదేహంతో ఆసుపత్రి వద్ద వారు ఆందోళన చేపట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement