మున్సిపల్ చైర్మన్ వేధింపులతో మహిళ ఆత్మహత్య | woman commits suicide in srikalahasti | Sakshi
Sakshi News home page

మున్సిపల్ చైర్మన్ వేధింపులతో మహిళ ఆత్మహత్య

May 21 2015 5:14 PM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కూరగాయల మార్కెట్ లో విషాదం చోటుచేసుకుంది. వసంత అనే చిరువ్యాపారి ఆత్మహత్య చేసుకుంది.

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కూరగాయల మార్కెట్ లో విషాదం చోటుచేసుకుంది. వసంత అనే చిరువ్యాపారి ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి, కమిషనర్ శ్రీరాం శర్మ వేధింపుల కారణంగానే వసంత ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.

వసంత ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ వేధింపులు తాళలేక తన తల్లి ఆత్మహత్య చేసుకుందని వసంత కుమారుడు ఆరోపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement