వడ్డీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యయత్నం | Woman Commits Suicide Due To Money Lenders Harassment In Prakasam | Sakshi
Sakshi News home page

అధిక వడ్డీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యయత్నం

Jul 2 2019 3:50 PM | Updated on Jul 2 2019 5:35 PM

Woman Commits Suicide Due To Money Lenders Harassment In Prakasam - Sakshi

సాక్షి, ప్రకాశం : జిల్లాలో అధిక వడ్డీ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. ఒంగోలులోని రైల్‌పేటకు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళను అక్రమ వడ్డీ వ్యాపారులు తీవ్ర వేధింపులకు గురిచేశారు. ఆదిలక్ష్మి ఇప్పటికే తీసుకున్న అప్పులకు అధిక వడ్డీల రూపంలో లక్షల రూపాయలు చెల్లించారు. అయిన కూడా అక్రమ వడ్డీ వ్యాపారులు అసలు చెల్లించాలంటూ ఆదిలక్ష్మిని వేధిసున్నారు. ప్రామిసరీ నోట్లు, బాండ్‌ పేపర్లపై సంతకాలు పెట్టాలని ఆమెను ఒత్తిడికి గురిచేస్తున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారుల వేధింపులకు సంబంధించి ఆదిలక్ష్మి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వడ్డీ వ్యాపారుల వేధింపులు ఆగకపోవడంతో ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement