ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
మొత్తం 22 అంశాలను తాము సభ దృష్టికి తీసుకొచ్చామని, అన్నింటిపైనా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారన్నారు. అన్ని అంశాలపై అధ్యయనం చేసి సభలో చర్చించాలని వైఎస్ జగన్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు.