విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు 8వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయడంపై చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌కు, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు.
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్కు 8వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయడంపై చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌కు, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. రాజస్థాన్‌లో సోలార్ కుంభకోణంపై విచారణ చేయాలని, అలాగే లగడపాటి లాంటి వారి ఆస్తులపై విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు.
లగడపాటి లాంటివారు అవినీతితో సంపాదించిన డబ్బుతోనే తమపై పెత్తనం చేయాలని చూస్తున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటున్నామని సీమాంధ్ర ఎంపీలు చెప్పడం అవివేకమని, అసలు వాళ్లు ఇప్పటివరకు సీడబ్ల్యుసీ, జీవోఎం, తెలంగాణపై కేబినెట్.. ఇలా ఏ ఒక్కదాన్నీ అడ్డుకోలేకపోయారని, ఇక రాష్ట్ర ఏర్పాటును ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు.