వామపక్ష పార్టీలు కూడా తెలంగాణ మద్దతివ్వడం దారుణమని సీపీఎం నేత రాఘవులు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: వామపక్ష పార్టీలు కూడా తెలంగాణ మద్దతివ్వడం దారుణమని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి రాఘవులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై స్పందించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టడం దారుణమని ఆయన విమర్శించారు. హిందుత్వ సిద్ధాంతాల కోసం తెలంగాణకు బీజేపీ మద్దతిస్తోందన్నారు.
తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగు దేశం పార్టీ ఎందుకు సమైక్యం అనడం లేదని ఆయన ప్రశ్నించారు. సమైక్యాంధ్ర అంటున్న నేతలు ఎందుకు వారి పార్టీలకు రాజీనామాలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజలో ఆటలాడుతుందని రాఘవులు మండిపడ్డారు.