
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ ప్రైవేట్ విద్యుత్ కంపెనీల నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేయడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా ప్రస్తుతం విద్యుత్‌కు ఎలాంటి డిమాండ్ లేకపోయినా, మిగులు విద్యుత్ ఉన్నా.. ఎక్కువ ధరకు రాష్ట్రంలో పవన విద్యుత్ కొనుగోళ్లు జరపడాన్ని సీఎస్ తీవ్రంగా పరిగణించారు.
ఇప్పటికే డిస్కమ్స్ ఏడాదికి రూ.2,000 కోట్ల నష్టాల్లో కూరుకుపోతున్నాయని, ఇలాంటి సమయంలో ఎక్కువ ధరకు కొనుగోళ్లు జరపడం కారణంగా డిస్కమ్స్‌పై పెనుభారం పడుతోందన్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నింటినీ తిరిగి సమీక్షించాలని సీఎస్ స్పష్టం చేశారు.