టీడీపీ సర్కారు పారిశ్రామికవేత్తల తొత్తు

W.Godavari : YSRCP Leader Alla Nani fire on TDP govt - Sakshi

చాగల్లు: పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తూ వారికి  రాష్ట్ర ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. వేతన బకాయిల చెల్లింపులలో చాగల్లు షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం అవలంభిస్తున్న వెఖరికి నిరసనగా గత 60 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల శిబిరాన్ని ఆళ్ల నాని, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయ కర్త తానేటి వనిత సందర్శించారు. ఈ సందర్బంగా  ఆళ్ల నాని మాట్లాడుతూ రైతులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. 700 కుటుంబాలకు సంబం ధించిన ఈ సమస్యను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు ఉన్నా కంటి తుడుపు చర్యలు తప్ప సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. కార్మికులు అనాథలు కాదని, వారికి వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని తెలిపారు.

షుగర్‌ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారంలో కార్మిక శాఖా మంత్రి పితాని సత్యనారాయణ చొరవ చూపడం లేదని, బాధ్యత లేనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. హెల్త్‌ డ్రింక్‌గా బీర్‌ను ప్రమోట్‌ చేస్తూ వ్యాఖ్యలు చేసిన మంత్రి జవహర్‌కు ఈ ప్రాంత రైతులు, కార్మికుల సమస్య ఏమాత్రం పట్టడం లేదని అన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా అసెంబ్లీలో, శాసనమండలిలో పోరా టం చేస్తామని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత మాట్లాడుతూ వేతనాలు చెల్లింపులు లేక కార్మికుల కుటుంబాలు అప్పుల పాలయ్యాయని అన్నారు. వేతన బకాయిలను వెంటనే చెల్లించా లని ఆమె∙డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఆత్కూరి దొరయ్య, పార్టీ రాష్ట్ర్‌ర కార్యదర్శి పోతుల రామతిరుపతిరెడ్డి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ , జిల్లా రైతు విభాగం అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావు, చాగల్లు, కొవ్వూరు, తాళ్లపూడి మండలాల, నిడదవోలు పట్టణ పార్టీ కన్వీనర్లు కొఠారు ఆశోక్‌బాబా, గురుజు బాలమురళీ కృష్ణ, కుంటముక్కల కేశవనారాయణ, ఎం.ఫణీంద్ర, పార్టీ నాయకులు బండి పట్టాభి రామారావు, ముదునూరి నాగరాజు, పీకే రంగారావు, ముళ్లపూడి కాశి, జుజ్జవరపు రామచంద్రరావు, జుట్టా కొండలరావు, ఫ్యాక్టరీ ఉద్యోగ, కార్మిక సంఘం అధ్యక్షుడు నీరుకొండ కృష్ణారావు, యూనియన్‌ నాయకులు ఉన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top