అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం చేనేత సంఘం నేతలు కలిశారు.
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో రైతు భరోసా యాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం చేనేత సంఘం నేతలు కలిశారు. చేనేత రంగాన్ని పరిరక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. అలాగే చేనేతలకు రుణమాఫీ వర్తించే చేయాలని, ముడి సరుకులు 50 శాతం సబ్సిడీకి ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు. ధర్మవరంలో పవర్లుమ్స్ ఉత్పత్తులను నియంత్రించాలని చేనేత సంఘం నేతలు కోరారు.
కాగా చేనేత కార్మికుడు మల్లికార్జున కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం శాంతినగర్లో చేనేత కార్మికురాలు లక్ష్మీదేవి కుటుంబాన్ని ఆయన పరామర్శించి, అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.