వనరులతో సంబంధం లేనివన్నీ చేస్తాం: చంద్రబాబు | We will do the works without money related: Chandrababu | Sakshi
Sakshi News home page

వనరులతో సంబంధం లేనివన్నీ చేస్తాం: చంద్రబాబు

Jul 12 2014 4:05 PM | Updated on Jul 28 2018 3:46 PM

చంద్రబాబు నాయుడు - Sakshi

చంద్రబాబు నాయుడు

రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకుని ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

విజయవాడ: రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకుని ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ రోజు ఇక్కడ జరిగిన ఏపి ఎన్జీఓల అభినందన  సభలో ఆయన ప్రసంగించారు.  ఏపీలో 17వేల కోట్ల రూపాయలకు పైగా లోటుబడ్జెట్‌ ఉందని తెలిపారు.  ఏపీఎన్జీవోలు అడిగిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల రైగ్యులరైజ్ చేయడం వనరులతో కూడుకున్నపని అన్నారు. ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఏపి ఎన్జీఓల  సమస్యల్లో వనరులతో సంబంధం లేనివన్నీ చేస్తామన్నారు.

ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. విజయవాడ, విశాఖ కార్పొరేషన్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement