‘విద్య ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’ | we stops education privatisation says by ysrcp mla | Sakshi
Sakshi News home page

‘విద్య ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’

Nov 18 2015 3:31 PM | Updated on Jul 11 2019 5:12 PM

‘విద్య ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’ - Sakshi

‘విద్య ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’

ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు.

సాలూరు: ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. టీడీపీ యత్నాలను వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు.

విజయనగరం జిల్లా సాలూరులోని ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహంలో బుధవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ మహాసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తూ ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాజన్నదొర చెప్పారు. అలాగే, భవన నిర్మాణం పూర్తి చేసుకున్న సంక్షేమ హాస్టళ్లను కూడా ప్రారంభించటం లేదని రాజన్న దొర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement