
జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం రాఘవులు
రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)కు తాము ఎటువంటి నివేదిక ఇవ్వం అని ఆ లేఖలో తెలిపారు.
రాష్ట్ర విభజనను సిపిఎం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సిపి, ఎంఐఎం, సిపిఎం మూడు పార్టీలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాయి.