కిరణ్‌ను సీఎంగా భావించడం లేదు: పొన్నం | We do not think Kiran Kumar Reddy as a CM: Ponnam Prabhakar | Sakshi
Sakshi News home page

కిరణ్‌ను సీఎంగా భావించడం లేదు: పొన్నం

Sep 12 2013 9:23 PM | Updated on Sep 1 2017 10:39 PM

కిరణ్‌ను సీఎంగా భావించడం లేదు: పొన్నం

కిరణ్‌ను సీఎంగా భావించడం లేదు: పొన్నం

సీమాంధ్ర ఉద్యమానికి స్పాన్సరర్‌గా, సమైక్యాంధ్ర జేఏసీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని తాము ముఖ్యమంత్రిగా చూడడం లేదని ఎంపీ పొన్నo ప్రభాకర్ అన్నారు.

సీమాంధ్ర ఉద్యమానికి స్పాన్సరర్‌గా, సమైక్యాంధ్ర జేఏసీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని తాము ముఖ్యమంత్రిగా చూడడం లేదని ఎంపీ పొన్న ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏదైనా సమస్య ఉంటే తాము సీఎంను సంప్రదించడం లేదని, నేరుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్తున్నామని చెప్పారు.

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు పెట్టి జైలుకు పంపిన సీఎం, డీజీపీలు.. సీమాంధ్రులకు ఎస్కార్ట్ ఇచ్చిమరీ ఉద్యమానికి సహకరిస్తున్నారని విమర్శించారు. ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ దినేష్‌రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మంత్రులే రాజీనామాలు చేసినప్పుడు డీజీపీ ఎందుకు తప్పుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

దినేష్‌రెడ్డి డీజీపీ పదవిలో ఉంటే ఆయనపై విచారణ ఎలా జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయిందని, దానిని ఎవరూ అడ్డుకోలేదని అన్నారు. ఏపీఎన్జీవోలు హైకోర్టు చెప్పినా సమ్మె కొనసాగిస్తామనడం కోర్టు ధిక్కారం అవుతుందని తెలిపారు. ఈనెల 17న ఎంపీలమంతా మళ్లీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement