సన్మాన సభను విజయవంతం చేయండి | want to success Felicitated by House | Sakshi
Sakshi News home page

సన్మాన సభను విజయవంతం చేయండి

Apr 23 2015 3:43 AM | Updated on Oct 16 2018 6:27 PM

కళింగ కోమట్లను బీసీ జాబితాలో చేర్చిన సందర్భంగా శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ కూడలి వద్దనున్న మున్సిపల్ మైదానంలో...

- కళింగ కోమటి సంక్షేమ సంఘం పిలుపు
శ్రీకాకుళం అర్బన్:
కళింగ కోమట్లను బీసీ జాబితాలో చేర్చిన సందర్భంగా శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ కూడలి వద్దనున్న మున్సిపల్ మైదానంలో ఈ నెల 26వ తేదీన జిల్లా కళింగ కోమటి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజాప్రతినిధుల సన్మానసభను విజయవంతం చేయాలని ఆ సంఘ ప్రతినిధులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని ఓ హోటల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ 35 ఏళ్లుగా కళింగ కోమట్లంతా చేసిన పోరాట ఫలితంగానే వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చారన్నారు.

దీనికి పూర్తిస్థాయిలో సహకరించిన మంత్రి అచ్చెన్నాయుడు, విప్ రవికుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ చౌదర ధనలక్ష్మితో పాటు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను సత్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కళింగ కోమటి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు వరహానరసింహం(వరం), జిల్లా అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు, పట్టణ అద్యక్షుడు అంధవరపు సూరిబాబు, సంఘ ప్రతినిధులు కోరాడ హరిగోపాల్, జామి భీమశంకర్, పి.వి.రమణ, తంగుడు జోగారావు, ఇప్పిలి శేషగిరిరావు, తంగుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా యువజన విభాగం అధ్యక్షునిగా కోరాడ హరిగోపాల్
కళింగ కోమటి సంక్షేమ సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షునిగా కోరాడ హరిగోపాల్, సంఘ ప్రధాన కార్యదర్శిగా శిల్లా బ్రహ్మాజీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు వరహానరసింహం ప్రకటించారు. అలాగే, జిల్లా మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డోకి భానుమతి, ఇప్పిలి భవాణీలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశం సందర్భంగా సభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement