మాస్కూల్‌కు సైన్స్‌ టీచర్‌ కావాలి.. | Want To Science Teacher In Our School Students Request Visakhapatnam | Sakshi
Sakshi News home page

మాస్కూల్‌కు సైన్స్‌ టీచర్‌ కావాలి..

Aug 4 2018 12:33 PM | Updated on Jul 26 2019 6:25 PM

Want To Science Teacher In Our School Students Request Visakhapatnam - Sakshi

విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న మేడివాడ హైస్కూల్‌ విద్యార్థులు

విశాఖపట్నం, రావికమతం: మా స్కూల్‌కు ఎన్‌ఎస్‌ టీచర్‌ను వేయాలని, ఉప విద్యాశాఖాధికారి ఆదేశాలను అమలు చేయాలంటూ మేడివాడ హైస్కూల్‌ విద్యార్థులు మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. ఆ స్కూల్లో ఎన్‌ఎస్‌ టీచర్‌ లేరు. దీంతో పాఠశాలు బోధన జరగక పోవడంతో విద్యార్ధులంతా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో యలమంచిలి డిప్యూటి డిఈవో స్పందించారు. రావికమతం హైస్కూల్లో ముగ్గురు ఎన్‌ఎస్‌ టీచర్లు ఉన్నారు.

విద్యార్థుల నిష్పత్తి కంటే ఒకరు అదనంగా ఉండడంతో ఒకరిని మేడివాడ స్కూల్‌కు డెప్యుటేషన్‌పై వేశారు. అయితే ఇప్పటికీ ముగ్గురిలో ఎవరూ కూడా అక్కడికి వెళ్లలేదు. దీంతో తరగతులు జరగక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు లేకుంటే తాము స్కూల్‌కు ఎందుకు వెళ్లాలని, పదో తరగతి ఎలా పాస్‌ కావాలంటూ విద్యాశాఖ కార్యాలయానికి వచ్చిన మేడివాడ విద్యార్థులు నినాదాలు చేశారు.డిప్యూటీ డీఈవో ఆదేశాలు పట్టించుకోరా అంటూ విద్యాశాఖాధికారి కె.అప్పారావును ప్రశ్నించారు. తక్షణం ఎన్‌ఎస్‌ టీచర్‌ను వేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement