వైఎస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో చవితి వేడుకలు | Vinayaka Chavithi Pooja at YSRCP office in kakinada | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో చవితి వేడుకలు

Aug 25 2017 1:43 PM | Updated on Aug 9 2018 2:42 PM

కాకినాడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.

సాక్షి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పూజలు నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంలో పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, చలమలశెట్టి సునీల్‌, గుడివాడ అమర్నాథ్‌, వేణుగోపాల్‌ కృష్ణ, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, కోన రఘుపతి, వంతల రాజేశ్వరితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ: హైదరాబాద్‌లోని వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ వినాయక చవితి వేడుకలు జరిగాయి. వేద పండితుని మంత్రోచ్ఛరణ నడుమ బొజ్జ గణపయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి,  తెలంగాణ వైఎస్‌ఆర్‌ సీపీ నేత కొండా రాఘవరెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు... దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నేతలు కాంక్షించారు.










Advertisement
 
Advertisement
Advertisement