ఇసుక అక్రమ తవ్వకాలకు నిరసనగా చోవడవరం వద్ద గ్రామస్తులు నిరసనకు దిగారు.
ఇసుక తవ్వకాలు జిల్లాలో మరోసారి వివాదానికి దారి తీశాయి. చోడవరం మండలం గవర వరం ఇసుక ర్యాంప్ వద్ద గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇసుక ర్యాంప్ వద్ద అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. ఇసుక తవ్వకాల వల్ల పక్కనే ఉన్న వంతెనకు ప్రమాం పొంచి ఉందని తవ్వకాలను అడ్డుకున్నారు. గ్రామస్తుల ఆందోళనతో ఇసుక ర్యాంప్ లో తవ్వకాలు ఆగిపోయాయి.