బంగారు భవిష్యత్తుకు వేదిక వైఎస్సార్‌ క్రికెట్‌ టోర్నీ

Vijay Sai Reddy Open YSR Cricket Tourney In Chittoor - Sakshi

ఆటలతో పాటు ఉపాధి కల్పించడం అద్భుతం

చంద్రగిరి దాహార్తి తీర్చేందుకు ఆరు నీటి ట్యాంకర్లు

చెవిరెడ్డి స్ఫూర్తితో వైజాగ్‌లోనూ టోర్నమెంట్‌

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

క్రీడాభివృద్ధికి  రూ.25 లక్షల సాయం చేస్తా : ఎంపీ వరప్రసాద్‌

తిరుపతి రూరల్‌:  క్రీడలతో పాటు వందలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో యువత బంగారు భవిష్యత్తుకు వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ వేదికగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలు, భారీ టోర్నమెంట్లతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి యువతకు ఐకాన్‌గా మారారని కొనియాడారు. టోర్నమెంట్‌ వద్దే యువత నుంచి ఉపాధి కోసం బయోడేటాలు స్వీకరించడం హర్షణీయమన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం తుమ్మలగుంట లో నిర్వహిస్తున్న వైఎస్సార్‌ గ్రామీణ క్రికెట్‌ టోర్నమెంట్‌ పదో రోజు ఉత్కంఠభరితంగా కొనసాగింది. మంగళవారం పోటీలకు విజయసాయిరెడ్డితోపాటు తిరుపతి ఎంపీ వరప్రసాద్,  వైఎస్సార్‌సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, తుడా మాజీ చైర్మన్‌ ఎల్‌బీ ప్రభాకర్‌నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

సరదాగా బ్యాటింగ్, బౌలింగ్‌ చేస్తూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యే చెవిరెడ్డితో కలిసి బైక్‌ నడుపుతూ పది మైదానాల్లో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించారు. మెడల్స్, సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలను సైతం ఎమ్మెల్యే చెవిరెడ్డి సొంత నిధులతో చేపట్టడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్‌కు తనవంతుగా రూ.5 లక్షలను అం దిస్తానని తెలిపారు. యువతను ప్రోత్సహించే ఇలాంటి టోర్నమెంట్లను ప్రతి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా తాను మోడల్‌ జిల్లాగా ఎంచుకున్న వైజాగ్‌లో చెవిరెడ్డి సహకారంతో ఇలాంటి టోర్నమెంట్‌ను త్వరలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చెవిరెడ్డి చేపట్టే కార్యక్రమాలకు తాను వెన్నంటి ఉంటానని, చంద్రగిరి నియోజకవర్గం లో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీ నిధులతో ఆరు వాటర్‌ ట్యాంకర్లను అందిస్తానని ప్రకటించారు.

యువ చైతన్యానికి ప్రతీక చెవిరెడ్డి
నిత్యం ప్రజా సేవలో తరిస్తూ, యువతను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భా స్కర్‌రెడ్డి యువ చైతన్యానికి ప్రతీక అని ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు రానున్న రోజుల్లో రూ.25 లక్షల నిధులను మం జూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రోజుకు 20 గంటలు శ్రమించే నాయకుడు చెవిరెడ్డి అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు నాయకుడికి గట్స్‌ కావా లన్నారు. ఎల్‌బీ ప్రభాకర్‌నాయుడు మాట్లాడు తూ చెవిరెడ్డికి యువత ఎంతగా అండగా ఉంటే అంత ఉత్సాహంగా పనిచేస్తారని తెలిపారు. ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ యువకులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపా రు. ఇందులో భాగంగా జూలై 6న జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి కోసం మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top