తిరుమల ఆలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
తిరుమల ఆలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పారిస్ ఘటన తర్వాత నిఘా వర్గాల హెచ్చరికల నేపధ్యంలో టీటీడీ భారీ భద్రతా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆలయానికి అదనపు భద్రత కల్పించారు. ఇప్పటికే ఎస్‌పీఎఫ్, ఏఆర్ కమాండోలు అప్రమత్తంగా పహారా కాస్తున్నారు. యాక్షన్ టీంగా పరిగణించే ఆక్టోపస్ దళాలు కూడా అనుక్షణం శ్రీవారి భద్రతలో అప్రమత్తంగా ఉన్నాయి. భక్తులు సంచరించే ముఖ్య కూడళ్లలో కూడా నిఘా ఉంచారు. బాంబ్, డాగ్ స్వ్కాడ్‌లు అప్రమత్తమై రెండు రోజులుగా తిరుమలలో ముమ్మరంగా త నిఖీలు నిర్వహించాయి. క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా నిఘాను పెంచారు. అలిపిరి, తిరుమలలోని జీఎన్‌సీ టోల్‌గేట్లో తనిఖీలు రెట్టింపు స్థాయిలో నిర్వహించారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న టీటీడీ సీవీఎస్‌వో నాగేంద్రకుమార్.. అందుకనుగుణంగా భద్రతా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు సాధారణ పోలీసు విభాగాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి.