తుప్పుపడుతున్న వాహనాలు | Vehicles wishing to corrosion | Sakshi
Sakshi News home page

తుప్పుపడుతున్న వాహనాలు

Oct 29 2015 2:12 AM | Updated on Sep 22 2018 8:22 PM

తుప్పుపడుతున్న వాహనాలు - Sakshi

తుప్పుపడుతున్న వాహనాలు

సారూ... మాకెన్నాళ్లీ సంకెళ్లు. మా యందు దయ ఉంచి తమను రోడ్డుపైకి విడిచిపెట్టండి. రహదారులపై జామ్ అంటూ దూసుకుపోతాం..

ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్‌లో పేరుకుపోయిన వైనం
 
చెరుకుపల్లి : సారూ... మాకెన్నాళ్లీ సంకెళ్లు. మా యందు దయ ఉంచి తమను రోడ్డుపైకి విడిచిపెట్టండి. రహదారులపై జామ్ అంటూ దూసుకుపోతాం.. అని వేడుకుంటున్నాయి ద్విచక్రవాహనాలు. చోరీకి గురైన వాహనాలు, రోడ్డు ప్రమాదాలకు గురైన వాహనాలను పోలీసులు  స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఓ మూన పడేశారు. ఇవి ఏళ్ల తరబడి ఎండుకు ఎండుతూ.. వర్షానికి తడుస్తూ తుప్పుపట్టి పాడైపోతున్నాయి. ఈ వాహనాలు తమవేనని ఎవరూ రావడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.

పోనీ పాడైపోతున్న వాహనాలకు వేలం పాట నిర్వహించడంలోనూ పోలీసులు చిత్తశుద్ధి కనపర్చడం లేదు. స్టేషన్ ఆవరణలో ఆ వాహనాలు తుప్పుపట్టి శిధిలమవుతున్నా అధికారులు పట్టీపట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement