రాయల దేవరకొండపై వజ్రాలు !?


  వజ్రాలున్నాయంటూ ప్రచారం

  గుర్తు తెలియని వ్యక్తుల తవ్వకాలు

  రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు


 

ఆ గ్రామస్తులు దైవంగా పూజించే కొండను గుర్తు తెలియని వ్యక్తులు కొన్నాళ్లుగా రోజూ వచ్చి ఏదో తవ్వి తీసుకువెళ్తున్నట్టు ప్రచారం జరిగింది. అది ఉత్తుత్తిదేనని కొన్నాళ్లుగా కొట్టి పారేస్తున్న గ్రామస్తులకు ఈ నెల 11న కొండపైకి వెళ్లిన ఓ వ్యక్తికి అక్కడ తవ్వకాలు జరిగిన ప్రదేశం కనిపించింది. ఆ విషయం కాస్త చూసిన వ్యక్తి కొండపై జరిగిన తంతును, తవ్వకాలను గ్రామస్తులకు తెలిపాడు. అంతే..ఆదివారం గ్రామస్తులంతా కొండెక్కారు. తవ్వకాలను కళ్లారా చూశారు.. అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కలవరానికి గురయ్యారు. దీనిపై అధికారులే నిజాల నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. వారే శ్రీకాకుళం జిల్లాలోని రాయల గ్రామస్తులు. తవ్వకాలకు గురైనది ఈ గ్రామానికి సమీపంలో ఉన్న దేవరకొండ. వివరాల్లోకి వెళ్తే...కొత్తూరు :  జిల్లాలోని కొత్తూరు మండలంలోని రాయల గ్రామానికి సమీపంలో ఉన్న దేవరకొండ శిఖర భాగంలో రెండు బండరాళ్ల మధ్య అడుగున వజ్రాలు, వైఢూర్యాలతో పాటు విలువైన రంగురాళ్లు ఉన్నాయన్న ప్రచారం ఆదివారం కలకలం రేపింది. ప్రచారాన్ని నమ్మిన గ్రామస్తులు దేవరకొండ పైకి వెళ్లారు.  వీఆర్‌వో కలమట రమేష్‌కు గ్రామస్తులు కొందరు ఫిర్యాదు చేశారు. కొండ మీద తవ్వకాలు పరిశీలించి జరిగిన సంఘటనపై తహశీల్దార్ కార్యాలయూనికి నివేదిక అందించినట్టు వీఆర్‌వో తెలిపారు. దీనిపై వివరాలు సేకరించగా పై రెండు బండరాళ్ల మధ్యన రెండు నెలల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు తవ్వకాలు చేసినట్టు తెలిసింది. వీరు ఆటో, కారు, బైక్‌ల మీద రోజూ వచ్చి తవ్వకాలు గోప్యంగా చేస్తున్నట్టు సమాచారం. సాయంత్రం పూట గోనె సంచులతో ఆటో మీద తిరిగి వెళ్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. రెండు నెలల నుంచి ఈ తంతు జరుగుతున్నా గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు.


ఈ క్రమంలో ఈ నెల 11న కొండ మీద ఉన్న ప్రాంతంలో జీడి తోట ఉన్న ముగితి భాస్కరరావు తోట కాపు ఎలా ఉందో చేసేందుకు వెళ్లాడు. అప్పటికే ఆ ప్రాంతంలో తవ్వి బయట పడేసిన రాళ్లను చూసి విషయూన్ని గ్రామస్తులకు తెలిపాడు. దీంతో తవ్వకానికి మళ్లీ వచ్చిన వారిని మాజీ సర్పంచ్ జనార్ధనరావు 11న ప్రశ్నించారు. రాళ్ల కింద మట్టి ఔషధాల కోసం ఉపయోగపడుతుందని వారు చెప్పగా ఇకపై ఇక్కడ ఎటువంటి తవ్వకాలు చేయొద్దని ఈ కొండను దేవతలుగా పూజిస్తున్నామని తెలిపారు. అరుుతే శనివారం కూడా వేరే మార్గంలో వారు వచ్చి వెళ్లినట్టు గ్రామస్తులకు తెలిసింది.


అదే సమయంలో తవ్వకాల ద్వారా విలువైన రంగురాళ్లు, వజ్రాలు దొరికినట్టు ప్రచారం జరగడంతో గ్రామస్తులు ఆదివా రం కొండపైకి వెళ్లారు. తవ్విన చోట పరిశీలించారు. తవ్వకాలు చేసిన వారిలో ఒకరు రుద్రాక్షమాలలు వేసి ఉండగా మిగతా నలుగురు మామూలుగా ఉన్నారని, వీరు తమ వివరాలు ఎవరికీ చెప్పకుండా గోప్యంగా వచ్చి వెళ్తున్నారని తెలిసింది. దీంతో ఈ విషయం పరిసర ప్రాంతాల్లో వ్యాపించి ఆదివారం పెద్ద చర్చనీయూంశమైంది. ఇది లా ఉండగా గ్రామస్తులు దేవర కొండను దేవతల కొండగా భావిస్తూ వర్షాలు కురవని సమయంలో పూజలుచేస్తూ విశ్వాసం ప్రదర్శిస్తారు.ఈక్రమంలోజరిగిన తవ్వకాలపై అధి కారులు సమగ్ర దర్యాప్తు అనుమానాలు నివృత్తి చేయూలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top