
నంద్యాలలో టీడీపీది పచ్చిమోసం
నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన నిజాలు బయటపెట్టారు.
జూలై 17 నుంచి ప్రారంభించి ఒక్కో గ్రూపునకు రూ. 48 వేలు చొప్పున జమచేశారని తెలిపారు. ఈ తతంగాన్ని నెల రోజుల్లో ముగించారని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పాస్‌బుక్‌ల కాపీలను మీడియాకు చూపారు. ఉప ఎన్నికకు ముందు ఇలా చేయడం చాలా తీవ్రమైన అంశమని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా రూ. పదివేల రుణాన్ని రద్దు చేయలేదు కానీ, నంద్యాలలో మాత్రం ఉప ఎన్నికకు ముందే అక్కడి మహిళల ఖాతాల్లో రూ. 4 వేలు చొప్పున జమచేయడం దారుణమని ఉండవల్లి అన్నారు.