వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి ఖరారు | Umma reddy Venkateswarlu as ysrcp MLC candidate | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి ఖరారు

May 24 2015 3:07 AM | Updated on May 29 2018 2:55 PM

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా  ఉమ్మారెడ్డి ఖరారు - Sakshi

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి ఖరారు

స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరగబోయే ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు : స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరగబోయే ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది. గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఖరారుచేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నాయకులతో సంప్రదించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి సంస్థాగత వ్యవహారాలు నిర్వహిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి ముఖ్య భూమికను పోషిస్తున్నారు.

ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వారం  క్రితం జిల్లాకు వచ్చినప్పుడు పార్టీ నాయకుల అభిప్రాయాలను అడిగి తెల్సుకున్నారు. ఆ మేరకు అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. బాపట్ల మండలం కొండుబొట్లువారిపాలెంలో 1935లో జన్మి ంచిన ఉమ్మారెడ్డి ఎంఏ, ఎమ్మెస్సీ, చదివారు. సైంటిస్టు, విద్యావేత్త, ఎకనామిస్ట్ అండ్ వ్యవసాయదారుడుగా ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖలో పనిచేశారు.

1985లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న తరువాత రాజకీయాల్లో చేరారు. నిస్వార్ధపరుడిగా పనిచేసిన ఉమ్మారెడ్డి బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2,76,064 ఓట్లతో గెలుపొందారు. 1985లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1987-89 ఆంధ్రప్రదేశ్ అంచనాల కమిటీలో పనిచేశారు. 1989-91లో  లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1991లో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 1996లో మున్సిపల్ కేంద్రమున్సిపల్‌మంత్రిగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement