గొడ్డళ్లతో నరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల హత్య | two ysrcp activists axed to death in guntur | Sakshi
Sakshi News home page

గొడ్డళ్లతో నరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల హత్య

Aug 22 2014 12:07 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టీడీపీ వర్గీయులు దారుణంగా హతమార్చారు.

గుంటూరు జిల్లాలో టీడీపీ అరాచకాలు రోజురోజుకూ ప్రబలిపోతున్నాయి. గురువారం రాత్రి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టీడీపీ వర్గీయులు దారుణంగా హతమార్చారు. గొడ్డళ్లతో నరికి మరీ వీరిని చంపారు. ఈ సంఘటన బొల్లాపల్లి మండలం మేళ్లవాగులో జరిగింది.

మేళ్లవాగు గ్రామానికి చెందిన చిననాగిరెడ్డి, వెంకటరెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న వీళ్లను కాపుకాచి మరీ చంపేశారు. వీళ్లతో కలిపి ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో ఐదుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు. అర్ధరాత్రి వరకు కూడా పోలీసులు కనీసం గ్రామానికి చేరుకోలేదు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు ఎవరూ కనీసం ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా ధైర్యం చేయలేకపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement