డెంగ్యూ వ్యాధి మరో చిన్నారిని బలితీసుకుంది.
డెంగ్యూ వ్యాధి మరో చిన్నారిని బలితీసుకుంది. గుంతకల్లు పట్టణం తిలక్‌నగర్‌కి చెందిన సునీల్‌కుమార్,లత ల రెండో కుమారుడుస సాయి వర్మ (2) డెంగ్యూతో బుధావారం మరణించాడు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 8వ తేదీన సాయి వర్మకి తీవ్ర జ్వరం రావడంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడికి రక్త పరీక్షలు నిర్వహించి.. డెంగ్యూగా నిర్ధరించిన డాక్టర్లు.. అతడికి రక్తాన్ని ఎక్కించారు. రెండు రోజులు బాగానే ఉన్న బాలుడు మంగళవారం సాయంత్రం తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహిస్తుండగానే సాయివర్మ మరణించాడు.