వివాహేతర సంబంధం కారణంగా జంట హత్యలు జరిగాయి.
చిత్తూరు (తంబళ్లపల్లి) : వివాహేతర సంబంధం కారణంగా జంట హత్యలు జరిగాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం సమీపంలో.. కర్నాటక రాష్ట్ర పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తంబళ్లపల్లికి చెందిన సుకన్య(35), భర్త నుంచి విడాకులు తీసుకుని కర్నాటకలోని ఉండోళ్లపల్లిలో ఉంటుంది. అయితే అనంతపురం జిల్లాకు చెందిన వెంకటేశ్(42)కూడా వ్యవసాయం చేస్తూ ఉండోళ్లపల్లిలోనే ఉంటున్నాడు. కొన్నేళ్లుగా వెంకేటేశ్, సుకన్యల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే సుకన్య, వెంకటేశ్‌లను సుకన్య ఇంట్లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.