తూర్పుగోదావరి జిల్లా కె. గంగవరం మండలం సుందరపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం గోదావరిలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి.
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కె. గంగవరం మండలం సుందరపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం గోదావరిలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు గురువారం ఉదయం లభ్యమయ్యాయి. తామరపల్లికి చెందిన సాయికృష్ణ (20), వీర వెంకట పవన్ (18) మరో స్నేహితునితో కలిసి బుధవారం గోదావరిని చూసేందుకు వెళ్లారు.
అయితే వీరిద్దరూ ప్రమాదవశాత్తూ నీటిలో పడి మునిగిపోయారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు రాత్రంతా గాలించినా వీరి ఆచూకి లభ్యం కాలేదు. గురువారం ఉదయం ఇద్దరి శవాలు గట్టుకు కొట్టుకు వచ్చాయి. తమ పిల్లల ఆచూకి కోసం రాత్రంతా కళ్లు కాయలు కాసేలా నిరీక్షించిన తల్లిదండ్రులు, బంధువులు పిల్లల మృతదేహాలు చూసి కన్నీరుమున్నీరు అయ్యారు.