ఒక అధ్యాయం ముగిసింది..‘నిజమైన తార’ సెలవంటూ వెళ్లిపోయింది.. రీల్ లైఫ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ రియల్‌స్టార్‌గా ఎదిగిన సినీ నటుడు శ్రీహరికి అభిమాన లోకం ఘనంగా వీడ్కోలు పలికింది.
ఒక అధ్యాయం ముగిసింది.. ‘నిజమైన తార’ సెలవంటూ వెళ్లిపోయింది.. రీల్ లైఫ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ రియల్‌స్టార్‌గా ఎదిగిన సినీ నటుడు శ్రీహరికి అభిమాన లోకం ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కడసారి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. శ్రీహరి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోటెత్తిన అభిమాన కడలి మధ్య గురువారం రాత్రి ఆయన అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.